గ్రామాల్లో కమిటీలతో నేరాల నియంత్రణ: ఎస్సై

గ్రామాల్లో కమిటీలతో నేరాల నియంత్రణ: ఎస్సై

MLG: గోవిందరావుపేట మండలం మచ్చాపూర్‌లో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్సై తాజుద్దీన్ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ప్రత్యేక కమిటీల ద్వారా నేరాలను నియంత్రించనున్నట్లు తెలిపారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ కమిటీలు పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో గుడుంబా, పేకాట నిర్మూలనతో పాటు శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.