సింగర్‌గా బండి సంజయ్.. నేడే విడుదల

సింగర్‌గా బండి సంజయ్.. నేడే విడుదల

TG: నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ గాయకుడిగా మారారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ స్థాపించి వందేళ్లు పూర్తయిన నేపథ్యంలో కేంద్రమంత్రి ఆరెస్సెస్‌ గీతాలను ఆలపించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఈ గీతాలను శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ కరీంనగర్‌లో విడుదల చేయనున్నారు.