VIDEO: దారుణం.. యువకుడిని వేలాడదీసి దాడి
GNTR: గుంటూరు నగరంలోని కంకరగుంటలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక ఓ వైన్స్ దుకాణం వద్ద ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఓ యువకుడిని తలక్రిందులుగా వేలాడదీసి దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడికి గల కారణాలు, బాధితుడి వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.