స్కానింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా

స్కానింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా

NZB: నగరంలోని స్కానింగ్ కేంద్రాల పనితీరుపై నిరంతర నిఘా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజేశ్వరి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన జిల్లా స్థాయి సలహా సంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి స్కానింగ్ కేంద్రాన్ని తప్పకుండా పర్యవేక్షించాలని రెఫెరల్ స్లిప్పులను అధికారులు పరిశీలించాలని సూచించారు.