ఏపీఎల్ కౌన్సిల్ ఛైర్మన్‌గా మాజీ మంత్రి
VZM: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కౌన్సిల్ ఛైర్మన్‌గా మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం విజయవాడలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన్ని ఎన్నుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి ఛైర్మన్‌గా కూడా ఆయన పని చేస్తున్నారు. ఈ ఎన్నికతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.