గరుడ వాహనం పై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాథ
KDP: జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ రంగనాథ స్వామి ఆలయ నూలుపూజోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై కూర్చోబెట్టి భక్తులకు దర్శింపచేశారు. అనంతరం భక్తులు స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు.