'వాట్సాప్ గవర్నెన్స్' పై అవగాహన ర్యాలీ పాల్గొన్న ఎమ్మెల్యే

NTR: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వాట్సాప్ గవర్నెన్స్'పై మంగళవారం నందిగామ గాంధీ సెంటర్ నుంచి మెయిన్ బజార్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. MLA తంగిరాల సౌమ్య పాల్గొని ప్రజలకు సేవల వివరాలు వివరించారు. 9552300009 నంబర్‌కు మెసేజ్ ద్వారా 161 రకాల సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, కమిషనర్ లోవరాజ్ పాల్గొన్నారు.