తిరుగుడుమెట్ట పంచాయతీ కార్యదర్శికి పదోన్నతి
E.G: తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట పంచాయతీ గ్రేడ్-2 కార్యదర్శి సుభద్ర గ్రేడ్-1గా పదోన్నతి పొందారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు అందుకున్నట్లు ఆమె తెలిపారు. తిరుగుడుమెట్ట పంచాయతీ అభివృద్ధికి విశేష సేవలందించిన సుభద్రకు పదోన్నతి లభించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.