ప్రార్థనలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
సత్యసాయి: ధర్మవరంలోని హజరత్ సయ్యద్ మహమ్మద్ షా ఖాదర్ వలీ రహమతుల్లా అలై 99వ ఉరుసే షరీఫ్ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత సామరస్యాన్ని పెంపొందించే ఇలాంటి ఉత్సవాలు సమాజానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.