ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

WNP: అమరచింత మున్సిపాలిటీ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న నంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్‌ను ఇవాళ పట్టుకున్నట్లు ఎస్సై స్వాతి తెలిపారు. మస్తిపురం గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి అతడిపై కేసు నమోదు చేశారు.