'బాధితులను అన్ని విధాల ఆదుకుంటాం'

'బాధితులను అన్ని విధాల ఆదుకుంటాం'

MDK: బాధితులను అన్ని విధాల ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ హామీ ఇచ్చారు. మెదక్ మండలం మాచవరం గ్రామంలో సొగ కుమార్, లావణ్య గుడిసెలు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఘటన స్థలాన్ని డా. మైనంపల్లి రోహిత్ మంగళవారం పరిశించారు. బాధితులకు భరోసానిచ్చి తక్షణ సాయం, నిత్యావసరాలు సరుకులు అందించారు. ఇందిమ్మ ఇళ్లు మంజరు చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు.