'మన శంకరవరప్రసాద్ గారు'.. బిగ్ అప్‌డేట్
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రల్లో నటిస్తోన్న మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు'. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి భారీ అప్‌డేట్ ఇచ్చారు. రేపు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించబోతున్నట్లు తెలిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వం, భీమ్స్ సంగీతం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రానుంది. కాగా, JAN 9న 'ది రాజాసాబ్', రవితేజ 'BMW' JAN 13న రిలీజ్ కానున్నాయి.