VIDEO: భారీ వర్షానికి ఇళ్లల్లోకి వచ్చిన వర్షాపు నీరు

NZB: సిరికొండ మండలం తాళ్ల రామడుగులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. గోడ పడిపోయే ప్రమాదం ఉందని వాపోయారు. డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో ఇంట్లోకి నీళ్లు వచ్చి చేరాయని బాధితురాలు బొక్కల నర్సవ్వ శనివారం అన్నారు. బయటికి వెళ్లడానికి, వాహనాలు వెళ్లాలన్నా ఇబ్బందిగా మారిందని చెప్పారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.