టెక్కలిలో రైతుల ఆవేదన

SKLM: టెక్కలి మండలంలోని తలగాంలో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ వరి విత్తనాలతో తీవ్రంగా నష్టపోయామని, సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో స్వల్పకాలిక 110 రోజుల పంట షుగర్ లెస్ విత్తనాలు 15,048 రకం సాగు చేశామని చెప్పారు. దాదాపు 90 రోజులు గడిచినా పంట దిగుబడి లేదని అన్నదాతలు దిగులు చెందుతున్నారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.