వైసీపీ నాయకుడిని పరామర్శించిన మాజీ మంత్రి

వైసీపీ నాయకుడిని పరామర్శించిన మాజీ మంత్రి

సత్యసాయి: గోరంట్ల మండలం కలగేరి గ్రామంలో YCP సీనియర్ నాయకుడు కరావుల ఆదిమూర్తి రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శంకర్ నారాయణ శనివారం కరావుల ఆదిమూర్తి రెడ్డి స్వగృహానికి వెళ్లి, ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చుల కోసం రూ. 50 వేలు ఆర్థిక సాయం చేశారు.