'సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం'

SKLM: సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎం.కె.మిశ్రో అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం భాగంగా లక్ష్మీ నర్సు పేట మోడల్ ప్రాథమిక పాఠశాలలో శనివారం గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణ, విద్యా బోధనలో అంకితభావంతో పనిచేసిన పలువురు ఉపాధ్యాయులను ఆయన శాలువా కప్పి జ్ఞాపకాలు అందజేసి ఘనంగా సన్మానం చేశారు.