ఎంపీ కలిశెట్టి ప్రత్యేక పూజలు

SKLM: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీకాకుళంలోని అరసవల్లిలో ఆదివారం ఉదయం పూజలు నిర్వహించారు. ఈ మేరకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సమేతంగా శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎంపీ వెల్లడించారు.