మాపై బురద చల్లడం సరికాదు: రోజా
AP: మాజీమంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. 'టీడీపీకి చెందిన రాజానే టీటీడీకి వస్త్రాలు సరఫరా చేశారు. 2015 నుంచి వస్త్రాలను రాజా సరఫరా చేసినట్టు రిపోర్ట్‌లో స్పష్టంగా ఉంది. టీటీడీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటనను జగన్‌పై రుద్దడం దిగజారుడు రాజకీయమే. ఆధారాలు దాచిపెట్టి మాపై బురద చల్లడం సరికాదు. సమగ్ర విచారణ చేపట్టి శిక్షించాలి' అని డిమాండ్ చేశారు.