ఎర్రచందనం దుంగలు సీజ్

KDP: ఇప్పెంట వద్ద కడప ఫారెస్ట్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇన్నోవా కార్‌ను ఆపగా వారు కారు వదిలేసి పారిపోయారు. పరిశీలించగా ఎర్రచందనం తరలిస్తున్నట్లు తేలింది. దీంతో కారును, కారులోని 34 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. కారు రిజిస్ట్రేషన్ నంబరు ఆధారంగా దొంగలను పట్టుకుంటామని అధికారులు తెలిపారు.