స్కూళ్లలో వాటిని వాయిదా వేయండి: సుప్రీం

స్కూళ్లలో వాటిని వాయిదా వేయండి: సుప్రీం

ఢిల్లీలో క్షీణిస్తోన్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. ఈ సమయంలో స్కూళ్లలో స్పోర్ట్స్, అథ్లెటిక్స్ ఈవెంట్స్ నిర్వహించకూడదని తెలిపింది. అలా చేస్తే పిల్లలను గ్యాస్ ఛాంబర్‌లో కూర్చోబెట్టినట్లే అని పేర్కొంది. ఈవెంట్స్ వాయిదా వేసేలా స్కూళ్లకు ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ గాలి నాణ్యత నిర్వహణ కమిషన్‌కు సూచనలు చేసింది.