అందరూ అప్రమత్తంగా ఉండండి: ఇరాన్
తమ దేశ ప్రజలను లక్ష్యంగా చేసుకుని శత్రువులు దాడి చేస్తున్నారని ఇరాన్ మండపడింది. తమ పౌరులను టార్గెట్ చేస్తే ప్రతీకారం తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, ట్రంప్ మాట మీద నిలబడే వ్యక్తి కాదని ఇరాన్ మంత్రి రెజా సాల్హీ అన్నారు. ఆయన ప్రవర్తనను ఎవరూ అంచనా వేయలేరని పేర్కొన్నారు.