VIDEO: 29 బంతుల్లోనే 102 పరుగులు

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ‘ది 100 లీగ్’లో ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టు వీరవిహారం చేసింది. విజయానికి చివరి 40 బంతుల్లో 102 పరుగులు అవసరం కాగా సామ్ కరన్ (54*), జోర్డాన్ కాక్స్ (58*) ఇద్దరూ బౌండరీలతో చెలరేగారు. దీంతో 29 బాల్స్‌లోనే లక్ష్యాన్ని చేరుకున్నారు. కాగా టోర్నీలో ఓవల్ జట్టుకు ఇది ఐదో విజయం.