'మార్గదర్శుల ఎంపికకు అధికారులు కృషి చేయాలి'

NLR: సమాజంలోని అట్టడుగు వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన పీ4 పథకంలో మార్గదర్శుల ఎంపికకు అధికారులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆదేశించారు. మంగళవారం పీ4 పథక పురోగతిపై అధికారులతో అయన సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పీ4 పథక ఉద్దేశాలు గురించి విస్తృతంగా చర్చ జరిగినప్పుడే లక్ష్యాన్ని సాధిస్తామన్నారు.