శ్రీశైలంలో నేడు ఉగాది ఉత్సవాలు ప్రారంభం..!

శ్రీశైలంలో నేడు ఉగాది ఉత్సవాలు ప్రారంభం..!

నంద్యాల: శ్రీశైలం దేవస్థానంలో నేటి నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 7:15 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలను ప్రారంభిస్తారని ఈవో శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించనుండగా, భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.