పదవి విరమణ పొందిన ఈఈ రాజేందర్‌కు కలెక్టర్ సన్మానం

హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో నేడు పదవి విరమణ పొందుతున్న గృహ నిర్మాణ శాఖ ఈఈ దోర్నాల రాజేందర్‌ను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఘనంగా సన్మానించారు. గృహ నిర్మాణ శాఖలో మూడున్నర దశాబ్దాలుగా విశేష సేవలు అందించిన రాజేందర్ అభినందనీయుడని అధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.