కోఠి మహిళా వర్సిటీలో వేధింపులు!

కోఠి మహిళా వర్సిటీలో వేధింపులు!

TG: కోఠి మహిళా యూనివర్సిటీలో వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. మెస్‌ ఇన్‌ఛార్జ్ వినోద్‌ తమను వేధిస్తున్నాడంటూ పీజీ విద్యార్థినులు షీటీమ్‌‌కు ఫిర్యాదు చేశారు. అతడి వల్ల హాస్టల్‌లో ఉండాలంటే భయంగా ఉందని, విద్యార్థినుల భద్రతే ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. చాలామంది విద్యార్థినులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.