లక్ష్మీపురంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు
కృష్ణా: చలపల్లి మండలం లక్ష్మీపురంలో వేంచేసియున్న శ్రీదుర్గాపార్వతి సమేత సోమేశ్వరస్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు భమిడిపాటి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఉదయం గం.9.30 నుంచి మధ్యాహ్నం గం.12 వరకూ వ్రతాలు జరిపిస్తామన్నారు. పూజలో పాల్గొనే భక్తులు పూజ సామాగ్రి తెచ్చుకోవాలని సూచించారు.