అయ్యా.. పెన్షన్ ఇప్పించండి.!
TPT: కోట(ఎం) వెంకన్నపాలెంకి చెందిన 90 ఏళ్ల మునెమ్మ వృద్ధ్యాపంతో బాధపడుతున్నారు. ఆమె పెన్షన్ కోసం వెళ్లి, వేలిముద్రలు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పెన్షన్ వచ్చినప్పటికీ ఏడాదిగా అందడం లేదని బంధువులు తెలిపారు. దీంతో సచివాలయం సిబ్బందికి అడిగితే, “మీ-సేవ కేంద్రానికి వెళ్లి ఐరిష్, వేలిముద్రలు అప్డేట్ చేసుకోండి” అన్నారు. కానీ ఆమె కేంద్రానికి రాగల స్థితిలో లేరు.