రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ
బాపట్ల మండలం జిళ్ళెళ్లమూడి గ్రామంలో రాజముద్రతో కూడిన అత్యాధునిక భద్రతా ప్రమాణాల నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పంపిణీ చేశారు. రీసర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ప్రతి రైతుకు తన భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.