పోచమ్మ తల్లికి వెండి తోరణం అందజేత
NRML: సారంగాపూర్ మండలం అడెల్లి మహా పోచమ్మ తల్లికి ఓ భక్త దంపతులు భారీ విరాళాన్ని అందజేశారు. సారంగాపూర్‌కు చెందిన పదిరె వేణుచంధర్ రెడ్డి, కవిత దంపతులు అమ్మవారికి వెండి మకర తోరణాన్ని విరాళంగా అందించారు. రూ. 21 లక్షల వ్యయంతో దాదాపు 7 కిలోల వెండితో ఈ తోరాణాన్ని హైదరాబాద్‌లో తయారు చేయించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి బహూకరించారు.