పొదిలిలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం: పొదిలి పట్టణంలోని ఆంజనేయస్వామి గుడి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మార్కాపురం పొదిలి రోడ్డులోని ఆంజనేయస్వామి గుడి దగ్గర ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణా నష్టం జరగలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.