గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలు: ఎస్సై

గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలు: ఎస్సై

BDK: గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మండల వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రవి సూచించారు. సోషల్ మీడియా (వాట్సాప్, ఫేస్‌బుక్) లేదా ఇతర మాధ్యమాలలో పార్టీల గురించి గానీ, వ్యక్తుల గురించి గానీ చెడుగా ప్రచారం చేసినా లేదా వ్యక్తిగత దూషణలకు పాల్పడినా, అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.