పునర్విభజనపై అభిప్రాయానికి సిద్ధమా?
HYD: గ్రేటర్‌లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం చేయడంతో ఇప్పుడు అధికారులు వార్డుల పునర్విభజనపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయాలను సేకరించనున్నారు. 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోనున్నారు. ఇందుకు వారం గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత పది రోజుల్లోపు డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.