ఉత్తమ గేయ రచయితగా ఎంపికైన డాక్టర్ ఎర్ర హరికిషన్

ఉత్తమ గేయ రచయితగా ఎంపికైన డాక్టర్ ఎర్ర హరికిషన్

SRPT: తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ ఎర్ర హరికిషన్ ఉత్తమ గేయ రచయితగా ఎంపికయ్యారు. ఈయన రచించిన 'అమ్మా ఓ భారతమ్మ' గేయానికి సంస్కృతి విలువలు అందించే సంచార జాతుల కళా ప్రదర్శన విభాగం ఉత్తమ గేయంగా ఎంపిక చేసింది. దీంతో ఆదివారం గజ్వేల్‌లో జరిగిన సంచార జాతుల సమరసత ఉత్సవంలో వారికి జ్ఞాపిక అందించి నగదు తో పాటు ఘనంగా శాలువాలతో సన్మానించారు.