రూ. 5 లక్షల ప్రమాద భీమా అందజేసిన ఎమ్మెల్యే
కావలి రూరల్ మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గంటా గీతాంజలి విద్యుత్ షాక్‌తోొ మృతి చెందారు. ఆమెకు పార్టీ సభ్యత్వం ఉన్నందున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుండి మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇవాళ మృతురాలి భర్త కృష్ణమూర్తికి అందజేశారు.