VIDEO: మద్నూర్‌లో కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో
KMR:మద్నూర్‌లో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు మాట్లాడుతూ.. సోయా కొనుగోలు కేంద్రంలో ఎన్సీసీఎఫ్ నిబంధనలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అధిక వర్షాల కారణంగా పంటలో కొద్దిపాటి మట్టి ఉన్నా కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. కారణాలు చెప్పకుండా రైతుల నుంచి సోయాను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.