VIDEO: తుళ్లూరులో కార్మికుల సందడి
గుంటూరు: అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులకు ఆదివారం సెలవు కావడంతో, నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం తుళ్లూరు చేరుకున్నారు. దీంతో తులసి థియేటర్ సెంటర్, లైబ్రరీ సెంటర్, మెయిన్ బజార్ కార్మికులతో కిటకిటలాడాయి. నిత్యావసర సరుకులతో పాటు బట్టలు, ఇతర అవసరమైన వస్తువుల కొనుగోలుతో సండే మార్కెట్‌లో సందడి వాతావరణం నెలకొంది.