సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
SRD: నాగలిగిద్ద మండలంలోని ఈశ్వర్ గ్రామానికి చెందిన లబ్ధిదారు శారదాకు CMRF చెక్కును డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఆస్పత్రి అత్యవసర వైద్య చికిత్సల కోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ. 27వేలు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పండిత్ నాయక్ తదితరులు ఉన్నారు.