రేపు మెదక్‌కు రానున్న హరీశ్‌రావు

రేపు మెదక్‌కు రానున్న హరీశ్‌రావు

MDK: మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు గురువారం మెదక్ పట్టణంలో పర్యటించనున్నారు. స్థానిక బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో గెలిచిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.