సామెత- దాని అర్థం
సామెత: అన్యాయపు సంపాదన ఆవిరైపోతుంది
దాని అర్థం: నిజాయితీగా మంచి పద్ధతిలో సంపాదించిన ధనము నిలకడగా మన దగ్గరే ఉండి, మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అదే విధంగా అన్యాయంగా ఆర్జించిన సొమ్ము మన దగ్గర నిలబడక, వృథాగా ఖర్చు అయి కనిపించకుండా పోతుంది. ధన సంపాదనకు అన్యాయ మార్గాన్ని ఎంచుకోరాదని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.