వినియోగదారులకు చట్టాల పై అవగాహన కల్పించాలి

నిర్మల్: వినియోగదారుడు ప్రశ్నించడం మొదలు పెట్టినప్పుడే నాణ్యమైన వస్తు సేవలను పొందగలడని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువు రశీదు తీసుకోవడం వినియోగదారుని హాక్కు అన్నారు. వస్తువులో నాణ్యత లోపలను నిర్భయంగా అధికారులకు పిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. వినియోగారులకు చట్టాలపై అవగాహన కల్పించాలినీ అధికారులకు సూచించారు.