VIDEO: ఉత్సవాల్లో డాన్స్‌తో అదరగొట్టిన మహిళలు

కృష్ణా: గన్నవరం మండలం పాతగన్నవరంలో రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా జరిగిన శ్రీలక్ష్మితిరుపతమ్మ ఉత్సవాల్లో మహిళల డాన్స్ విశేషంగా ఆకట్టుకుంది. వివిధ కులాలకు చెందిన గ్రామస్థులు ప్రభలను కట్టి ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. చెన్నై-కోల్ కతా హైవేపై నిర్వహించిన ఊరేగింపులో ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.