రేపటి నుంచి పత్తి కొనుగోలు తాత్కాలికంగా నిలిపివేత
PDPL: సీసీఐ జిన్నింగ్ మిల్లులపై విధించిన నిబంధనల సడలింపు వచ్చే వరకు ఈనెల 17 నుంచి సీసీఐ ప్రైవేట్ పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రైతులు మార్కెట్ యార్డులకు, జిన్నింగ్ మిల్లులకు పత్తి తీసుకురావొద్దని, స్లాట్ బుకింగ్ ఉన్నవారూ కూడా పత్తి తీసుకురావొద్దని సూచించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు గమనించాలని కోరారు.