పశ్చిమబెంగాల్ సీఎస్‌పై ఈసీ వేటు

పశ్చిమబెంగాల్ సీఎస్‌పై ఈసీ వేటు

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈసీ ఆ రాష్ట్ర ఉన్నతాధికారులపై చర్యలకు దిగింది. చీఫ్ సెక్రటరీపై వేటు వేసింది. ప్రస్తుతం ఉన్న CS నందిని చక్రవర్తిని ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధులకు ఆమెను దూరంగా ఉంచుతున్నట్లు తెలిపింది. కొత్త CSగా దష్యంత్ నరియాలను నియమించింది. మరోవైపు హోంశాఖ కార్యదర్శిపైనా బదిలీ వేటు వేసింది.