'లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలి'

'లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలి'

NZB: కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం వేల్పూర్‌లోని తన స్వగృహంలో మంజూరు కోసం సిద్ధంగా ఉన్న మెండోరా మండలంకు చెందిన 35 కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ బ్యాచ్ ఫైల్స్‌పై సంతకాలు చేశారు.