ఆల్ ఇండియా కిసాన్ సెల్ మెంబర్‌గా ప్రవీణ్
KMR: బిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన గంపల ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కిసాన్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా శనివారం నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ఛైర్మన్ సుఖ్ పాల్ సింగ్ కైరాకు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, రైతు సంక్షేమానికి కృషి చేస్తానన్నారు.