VIDEO: ఈదురుగాలుల బీభత్సం.. ఆరుగురికి తీవ్ర గాయాలు
సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే గాంధీ నగర్‌లో ఓ గోడకూలి ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయాపడిన క్షతగాత్రులను వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.