ఆదోనిలో అంగన్వాడీ వర్కర్స్ రాస్తారోకో

ఆదోనిలో అంగన్వాడీ వర్కర్స్ రాస్తారోకో

KRNL: ఆదోనిలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ గ్రౌండ్ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ఇవాళ ర్యాలీ నిర్వహించారు. బీమా సర్కిల్ వద్ద రాస్తారోకో చేపట్టి అరెస్టులపై నిరసన తెలిపారు. వేతనాలను నెలకు రూ.26 వేలుగా పెంచాలని, ఈపీఎఫ్–ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, అదనపు యాపులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.