కేంద్రం మరో కీలక నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 300 బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్స్‌ను నిషేధించింది. వీటిలో ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్, బెట్టింగ్ ఎక్స్ఛేంజీలు, సట్టా/మట్కా గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్‌లు, రియల్‌మనీ కార్డ్-కెసినో గేమ్ యాప్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు ఇలాంటి 8,400 వెబ్‌సైట్లు, యాప్స్‌ను నిషేధించింది.