పోచమ్మ దేవాలయానికి జగ్గారెడ్డి లక్ష రూపాయల విరాళం
SRD: రాజంపేటలోని గాలి పోచమ్మ దేవాలయ అభివృద్ధికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్ ద్వారా ఆలయ కమిటీ సభ్యులకు లక్ష రూపాయలను గురువారం అందించారు. భవిష్యత్తులోనూ దేవాలయ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తానని జగ్గారెడ్డి తెలిపినట్లు కాంగ్రెస్ నాయకులు చెప్పారు.